'మల్లేశం' డైరక్టర్ ఫస్ట్ స్టెప్
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పుడప్పుడూ ఇండస్ట్రీలో కొన్ని విషయాలు జరుగుతుంటాయి. అవి తర్వాత చర్చనీయాంశాలుగా మారుతాయి. మరికొందరు వాటిని ఆచరిస్తారు. అలాంటి అగ్రిమెంట్‌నే గతంలో నయనతార చేసింది. `తులసి` సినిమా చేస్తున్నప్పుడు తాను ప్రచారాలకు రానని ఖరాఖండిగా చెప్పి సురేష్ ప్రొడక్షన్స్ లో అగ్రిమెంట్ చేసుకుంది నయనతార. అంతకు ముందు హీరోయిన్లు ఎవరూ అలాంటి షరతులతో అగ్రిమెంట్లు చేసుకోలేదు. ఆ తర్వాత ఇలాంటి అగ్రిమెంట్ల గురించి పెద్దగా టాక్ లేదు. కానీ తాజాగా `మల్లేశం` చిత్ర దర్శకుడు అగ్రిమెంట్ విషయంలో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.
ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం చిత్ర దర్శకుడు రాజ్ ఈ సారి అగ్రిమెంట్ చేసుకుంది క్యాస్టింగ్ కౌచ్ విషయంలో. తన టీమ్‌లో ఎవరైనా, ఎవరినైనా లైంగికంగా వేధించారని తెలిస్తే వెంటనే సినిమా నుంచి బయటకు వెళ్లాలని, దాంతో పాటు అప్పటిదాకా ఆ వ్యక్తి మీద పెట్టిన ఖర్చును కూడా భరించాలని, తిరిగి చెల్లించాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రతి నిర్మాణ సంస్థ పాటిస్తే బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిగ్ ఫ్రొడక్షన్ హౌస్‌లన్నీ ఈగోలను పక్కనపెట్టి రాజ్ పాటించిన పద్ధతులను పాటిస్తాయా? వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout