Mallareddy:తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి.. విచారణ వాయిదా..

  • IndiaGlitz, [Tuesday,December 19 2023]

తనపై నమోదైన భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy)తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. తన ప్రమేయం లేకుండానే తనపై కేసు నమోదు చేశారని.. అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కే.సురేందర్.. ప్రజాప్రతినిధుల కేసులను విచారించే బెంచ్ ముందు ఈ పిటిషన్‌ ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మల్కాజిరి జిల్లా చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీల వారసత్వ భూమిని కబ్జా చేశారని భిక్షపతి అనే వ్యక్తి శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించాడు. దాదాపు రూ.250కోట్ల విలువైన భూమిని కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మల్లారెడ్డితో పాటు శామీర్‌పేట ఎమ్మార్వో, ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపైనా కేసు నమోదుచేశారు. ఈ కేసుపై స్పందించిన మల్లారెడ్డి దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని తెలపగా.. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

కాగా 2014 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన మల్లారెడ్డి.. మల్కాజ్‌గిరి నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లోనూ మేడ్చల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఏడాది మొదట్లో పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్‌తో మల్లారెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా వైరల్ అవుతూనే ఉంది. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచే భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. చెరువులను ఆక్రమించి కాలేజీలు కట్టారని ప్రతిపక్ష నేతలు ఆరోపించేవారు.

More News

Corona:దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు.. తెలంగాణ ప్రభుత్వం అలర్ట్..

దేశంలో కరోనా కేసులు(Corona cases) మరోసారి పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

Revanth Reddy:రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న సవాళ్లు.. సీఎం పదవిని కాపాడుకుంటారా..?

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Salaar:ఫ్యాన్స్‌కు పూనకాలే.. అదిరిపోయిన 'సలార్' రిలీజ్ ట్రైలర్..

రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో సలార్ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Barrelakka: పవన్ కల్యాణ్‌ గురించి అలా మాట్లాడటం బాధేసింది: బర్రెలక్క

బర్రెలక్క.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. సోషల్ మీడియాలో బర్రెల్కకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

CM Jagan:పేదవాడికి ఖరీదైన వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యం: సీఎం జగన్

'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.