సుమంత్ అశ్విన్ తో మల్కాపురం శివకుమార్ నూతన చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
రొటిన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకునే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ హీరోగా మరో నూతన చిత్రం రూపొందనుంది. హీరో నితిన్‌తో ద్రోణ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వర్సెస్ సూర్య, శౌర్య వంటి విభిన్న చిత్రాలను నిర్మించి.. అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై నిర్మించబోతున్నాడు.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ వైవిధ్యమైన కథ, కథనాలతో చిత్రాలను తెరకెక్కించాలనే సంకల్పంతో మా సంస్థలో విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్నాను. అందులో భాగంగానే సుమంత్ అశ్విన్‌తో సరికొత్త కథ, కథనాలతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలుంటాయి. సుమంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోయే ఈ చిత్రం అత్యధిక బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments