సింగం-3 తెలుగు హక్కులు దక్కించుకున్న మల్కాపురం శివకుమార్!

  • IndiaGlitz, [Monday,August 08 2016]

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గినట్లుగానే ఈ చిత్రం తెలుగు హక్కులకు భారీ పోటీ నెలకొంది. అయితే ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ప్యాన్సీ రేటుతో దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ.... తొలి నుంచి మా సంస్థలో వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే భావనతోనే ఇటీవల సూర్య వర్సెస్ సూర్య, శౌర్య చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు తాజాగా సూర్య ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3ను తెలుగు హక్కులను దక్కించుకోవడం ఆనందంగా వుంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి.
ఈ చిత్రం షూటింగ్‌లో అధికభాగం వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరగడం విశేషం. తప్పకుండా ఈ చిత్రం తెలుగులో అఖండ విజయం సాధిస్తుందని నమ్మకం వుంది. ప్రముఖ కథానాయికలు అనుష్క, శృతిహాసన్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాతక్మంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అనుష్క, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్,

More News

వాళ్లిద్దరూ దేవుళ్లు అయితే నేను భక్తుడిని - డైరెక్టర్ పరుశురామ్

అల్లు శిరీష్,లావణ్య జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.

'పెళ్లిచూపులు' శాటిలైట్ హ‌క్కులు ఎంతంటే'

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ జంట‌గా తరుణ్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం పెళ్ళిచూపులు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సురేష్ బాబు విడుద‌ల చేసిన ఈ చిత్రం అన్నీ చోట్ల నుండి పాజిటివ్ టాక్‌ను రాబ‌ట్టుకుంది.

నెక్ట్స్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన వెంక‌టేష్

వెంక‌టేష్ - న‌య‌న‌తార జంట‌గా న‌టించిన చిత్రం బాబు బంగారం. మారుతి తెర‌కెక్కించిన బాబు..బంగారం ఈనెల 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

డిసార్డ‌ర్ వ్య‌క్తిగా రాజ్‌త‌రుణ్‌...

వ‌రుస విజ‌యాల మీదున్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్ సెల‌క్టెడ్ స‌బ్జెక్ట్స్ ఎంచుకుంటూ సాగిపొతున్నాడు. ప్ర‌స్తుతం వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సంజ‌నా రెడ్డి చిత్రంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు.

అడ‌వి శేష్ చిత్రంలో రీతూ

ఎవ‌డేసుబ్ర‌మ‌ణ్యంలో చిన్న‌పాత్ర‌లో క‌న‌ప‌డిన రీతూవ‌ర్మ త‌ర్వాత పెళ్ళిచూపులు చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది.చిత్ర‌గా ఈ చిత్రంలో స్వ‌తంత్ర్య భావాలు క‌లిగిన అమ్మాయిపాత్ర‌లోరీతూ న‌ట‌న అంద‌రి న‌ట‌న‌ను ఆక‌ట్టుకుంది.