24న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా...?

  • IndiaGlitz, [Sunday,July 12 2015]

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం మాలిని అండ్ కో'. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 24న సినిమా విడుదలవుతుంది.

సాధారణంగా సినిమాలు పూర్తయిన తర్వాత ఆడియో విడుదల చేస్తారు. అయితే పూనమ్ నటించిన ఈ చిత్రం ఆడియో విడుదల కావడం లేదు. చిన్న సినిమాల ఆడియో రైట్స్ కోసం కంపెనీలు రాకపోవడం, సీడీలు కొనేవారు లేకపోవడంతో ఆడియో వేడుక కోసం ఖర్చు పెట్టడం తమకు ఇష్టం లేదని అందుకే సినిమాని ఆడియో విడుదల లేకుండా డైరెక్ట్ సినిమాని జూలై 24న విడుదల చేసేస్తున్నారట. తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్, రొమాంటిక్ జోనర్ లో ఈ సినిమా రూపొందింది. మరి ఈ చిత్ర నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.