'మాలిని & కో' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Saturday,August 29 2015]

ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే తాను బట్టలిప్పేస్తాననంటూ బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చి వార్తల్లో కెక్కిన మోడల్ పూనమ్ పాండే. అప్పటి నుండి ఓ జోనర్ ప్రేక్షకులు పూనమ్ అభిమానులయ్యారు. సాధారణంగా అందచందాలు అరబోసే పూనమ్ పాండే సినిమా అనగానే ఎలా ఉంటుందోనని ఓ వర్గం ప్రేక్షకుడు ఆలోచించకమానడు. అలాంటి ఆలోచనలకు తావిస్తూ వీరు.కె దర్శకత్వంలో పూనమ్ చేసిన సినిమాయే మాలిని అండ్ కో. మరి ఈ సినిమాలో పూనమ్ వంటి గ్లామర్ తార ఏం చెప్పాలనుకుందో తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే...

కథ

ఇండియా అంటే పడని టెర్రరిస్ట్ గ్రూప్ చాలా ఉన్నాయి. వాటిలో జాఫ్నాకి చెందిన టీం ఒకటి ముంభైలో బాంబులు పేల్చాలని వస్తుంది. అయితే ఆ టీమ్ అక్కడ ఓ మసాజ్ పార్లర్ లోని మాలిని చూసి షాక్ కి గురవుతారు. అసలు అంత పెద్ద టెర్రరిస్టులు మాలిని చూసి షాక్ గురవ్వాల్సిన అవసరం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

సమీక్ష

సినిమా స్టార్టింగ్ డే నుండి రిలీజ్ వరకు పూనమ్ పాండే పై ఫుల్ పోకస్ తోనే సినిమా రూపొందింది. దర్శక నిర్మాతలు పూనమ్ ని ఈ పాత్రకు ఎందుకయితే తీసుకున్నారో అందుకు పూనమ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిందనే చెప్పాలి. మాస్ ఆడియెన్స్ కి పూనమ్ అందాల విందు సంతృప్తినిస్తుంది. అది సినిమాకి పెద్ద ప్లస్ అయింది. శ్రీలంకలోని జాఫ్నా బ్యాక్ డ్రాప్ పార్ట్ బాగుంది. సుమన్ డాన్ పాత్రలో తన పాత్రకు న్యాయం చేశారు. సమ్రాట్, రోహిత్ రెడ్డి, రవికాలే, మిలన్ ఇలా అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. అయితే పూనమ్ ఉంది కదా గ్లామర్ మీద పెట్టిన కాన్ సన్ ట్రేషన్ సినిమాపై పెట్టలేదు. ఓవర్ గ్లామర్ తో సినిమా ఇదేంటనిపించేలా ఉంది. సినిమా రన్నింగ్ విషయానికి వస్తే నెమ్మదిగా ఉంది. సీన్స్ మధ్య లింక్ కనపడదు. డైరక్టర్ వీరు కథపై, సినిమాపై శ్రద్ధ తీసుకుని ఉంటే బావుండేది. ఆయన మాలిని పై పెట్టిన దృష్టి అసలు విషయమైన కథ గురించి మరచిపోయాడు. ట్యూన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది.

విశ్లేషణ

మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు వంటి ఫ్యామిలీ చిత్రాలను చేసిన మనీషా ఫిలింస్ నుండి ఈ చిత్రమంటే ప్రేక్షకులు ముందు నమ్మరు. సరే ఈ ట్రెండ్ కోసం వారి స్టయిల్ మార్చారనుకున్నా టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా ఏ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా చేసుంటే బావుండేదేమో అని అనిపించింది. సరే కథ గమనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం స్పష్టంగా తెలుస్తుంది. పెర్ ఫార్మెన్స్ పరంగా పూనమ్ ఆకట్టుకోలేదు అయితే గ్లామర్ తో . మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది .

బాటమ్ లైన్: మాస్ ఆడియెన్స్ కి నచ్చే మాలిని

రేటింగ్: 2.5/5

English Version Review

More News

సింగర్ గా మారిన విలక్షణ నటుడు...

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కొత్త అవతారం ఎత్తాడు.

'బెస్ట్ యాక్టర్స్' మూవీ రివ్యూ

ప్రతి మనిషి జీవితంలో నటిస్తాడు, ఇది నిజం అయితే ఎంత మోతాదులో ఆ నటన ఉంటుంది అనేది చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు మీద ఆధారపడి ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమే బెస్ట్ యాక్టర్స్. జీవితంలో.. అనే ఉపశీర్షిక పెట్టి సినిమా కథను చెప్పకనే చెప్పాడు దర్శకుడు అరుణ్ పవర్.

చెర్రీ టైటిల్ ఫిక్స్ అయిపోయింది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలోకి స్వాతి సినిమా

స్వాతి, నవీన్‌చంద్ర హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'త్రిపుర'. ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా బ్యానర్‌పై రాజ కిరణ్‌ దర్శత్వంలో ఎ.చినబాబు

'డైనమైట్' సెన్సార్ పూర్తి

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు.