బాలయ్య సరసన మలయాళీ ముద్దుగుమ్మ..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 106వ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కోవిడ్ ప్రభావంతో ఆగిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తారని టాక్. అందులో ఓ పాత్రలో అఘోరాగా బాలయ్య మెప్పించనున్నారని సమాచారం. అలాగే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని ఓ సీనియర్ హీరోయిన్‌తో పాటు, ఓయంగ్ హీరోయిన్ నటిచంనుంది. యంగ్ హీరోయిన్గా కొత్త హీరోయిన్నే తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.
ఈ క్రమంలో బాలయ్య సరసన మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ను ఓకే చేశారట. తదుపరి ప్రారంభం కాబోయే షెడ్యూల్లో ఈమె జాయిన్ అవుతుందంటున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను తదుపరి షెడ్యూల్‌ను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి టైటిల్ ఇదేనంటూ ‘మొనార్క్, మొనగాడు’, ‘డేంజర్’, ‘బొనాంజ’, టార్చ్‌బేరర్ సహా పేర్లు వినిపించాయి. మరి బోయపాటి శ్రీను ఎలాంటి టైటిల్ పెడతారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com