స్వంత డబ్బింగ్ చెప్పుకోనున్న మలయాళ సూపర్‌స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `యాత్ర`. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించిన పాదయాత్ర ప్రధానంగా సాగే ఈ చిత్రం కాబట్టి ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను పెట్టారు.
ఈ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని మమ్ముట్టి భావిస్తున్నారట. మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ చల్లా, శశిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు. జగపతిబాబు, రావు రమేశ్, అనసూయ తదితరులు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com