బన్నీకి విలన్‌గా మలయాళీ స్టార్ హీరో..

  • IndiaGlitz, [Monday,March 22 2021]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘పుష్ప’లో మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా టాలీవుడ్‌లో పేరుగాంచిన ‌ మైత్రీ మూవీ మేకర్స్ మ‌రో నిర్మాణ సంస్థ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ‌టం విశేషం. టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, షూటింగ్ అప్‌డేట్‌లు తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా వ‌రల్డ్ వైడ్ క్రేజ్‌ను సంపాదించకుంది.

లేటెస్ట్ మూవీస్‌కు విమర్శకుల ప్రశంసలు..

ఆగ‌స్ట్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పుష్పరాజును ఢీకొట్టే ధీటైన విల‌న్ ఎవ‌ర‌నే ఉత్కంఠ సర్వత్రా నెల‌కొంది. ఆ ఊహాగానాల‌కు తెర‌దించుతూ పుష్ప‌లో న‌టించ‌నున్న విల‌న్ ఎవ‌ర‌నే విష‌యాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. జాతీయ అవార్డు గ్ర‌హీత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప‌లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఫ‌హాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు ఇండియా వైడ్‌గా అభిమానులు ఆద‌ర‌ణను దక్కించుకున్నాయి. ఫ‌హాద్ ఫాజిల్ లేటెస్ట్ చిత్రాలైన ‘ట్రాన్స్, సీ యూ సూన్’ వంటివి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను సైతం ద‌క్కించుకున్నాయి.

హైలైట్‌గా దేవిశ్రీ మ్యూజిక్..

ఈ చిత్రం లో పుష్ప‌రాజ్‌కి జోడిగా ర‌ష్మిక న‌టిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన ఆడియో హైలైట్‌గా నిలవనుంది. అల్లు అర్జున్‌, సుకుమార్, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో ఆడియో‌కి ఒక క్రేజ్ ఉంటుంది. సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువ‌ల్స్ అల్లు అర్జున్ అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లో అగ‌స్ట్ 13న ఏక‌కాలంలో విడుద‌ల చేయనున్నారు. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

More News

ఎన్టీఆర్‌ ప్రసంగిస్తుండగా.. ‘సీఎం సీఎం’ అంటూ అభిమానుల నినాదాలు..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్నకుమారుడు శ్రీసింహా కోడూరి ‘మత్తు వదలరా’ తరువాత హీరోగా నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'.

జీవితంలోని ఏడు రంగులనూ ‘రంగ్‌ దే’ చూపిస్తుంది: త్రివిక్రమ్

'రంగ్ దే' ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా ఈ చిత్రం రూపొందింది.

ఈ కుటుంబానికి నేనెప్పుడూ గెస్ట్‌ను కాను: ఎన్టీఆర్

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో  మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ సింహా కోడూరి తాజాగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’.

ట్రైలర్ టాక్: పెళ్లి చుట్టూ తిరిగే 'తెల్లవారితే గురువారం'

'మత్తు వదలరా' చిత్రంతో డీసెంట్‌ సక్సెస్‌ను అందుకున్న శ్రీసింహ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం 'తెల్లవారితే గురువారం'.

టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం.. తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం

తమ పార్టీ అభ్యర్థి విజయం ఆ పార్టీ కార్యాలయానికి ముప్పు తెచ్చిపెట్టింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో