నరేష్ తో మలయాళ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి నరేష్ హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు. వివిధ రకాలైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ హీరోగా `వడక్కన్ సెల్ళీ` అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. నిజానికి ఈ రీమేక్‌ను అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేయాల్సింది కానీ..కొన్ని కారణాలతో అనీష్ కృష్ణ స్థానంలో మలయాళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రజీత్ కరణ్‌వర్ మెగా ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు.
బోపన్న చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ భామ నిఖిల విమల నటిస్తుంది. ఇప్పటి వరకు మలయాళం, తమిళ సినిమాల్లోనే నటించిన నిఖిలకు తెలుగులో ఇదే తొలి చిత్రం. అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments