నానితో మలయాళ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళంలో ప్రేమమ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో సాయిపల్లవి నటన అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సాయిపల్లవి తెలుగులో వరుణ్‌తేజ్ సరసన `ఫిదా` సినిమాలో నటిస్తుంది. ఇది కాకుండా త్వరలోనే నేచురల్ స్టార్ నానితో కూడా జత కడుతుంది.
ఓ మై ఫ్రెండ్ ద్వారా దర్శకుడుగా పరిచయమైన వేణు శ్రీరాం తర్వాత మరే సినిమాను డైరెక్ట్ చేయలేదు. ఇప్పుడు నానితో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌లోకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో భూమిక కూడా కీలకపాత్రలో నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments