వెంకీ చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న మలయాళ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్ హీరోగా తమిళ చిత్రం అసురన్‌ను తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అందులో ప్రియమణి ఒక పాత్రలో నటిస్తుంది. కాగా ఫ్లాష్ బ్యాక్‌లో మరో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే దానిపై పలు వార్తలు వినిపించాయి. ఓ సందర్భంలో అమలాపాల్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజాలు లేవట. లేటెస్ట్ సమాచారం ప్రకారం మలయాళ ముద్దుగుమ్మ రెబా జాన్ నటిస్తుందట.
మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన రెబా జాన్.. నటన చూసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆమెను తీసుకోవాలని సంప్రదించడం ఆమె ఓకే అనడం చకచకా జరిగిపోయాయట. ఆసక్తికరమైన విషయమేమంటే..ఈమె అను ఇమ్మాన్యుయేల్ సోదరి కావడం. రీసెంట్గా ఫొటో షూట్ కూడా జరిగిందట. త్వరలోనే అధికారిక సమాచారం రానుందని అంటున్నారు. కలైపులి థాను, డి.సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. భూవివాదాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments