ప‌వ‌న్ 28లో మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌..?

  • IndiaGlitz, [Tuesday,May 12 2020]

త‌దుప‌రి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌టంతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా శ‌ర‌వేగంగా సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సినిమా 80 శాతం పూర్త‌య్యింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లైంది. ఈ సినిమా రెండు సినిమాలు లైన్‌లో ఉండ‌గానే మ‌రిన్ని ప్రాజెక్టుల‌ను ప‌వ‌న్ లైన్‌లో పెడుతున్నార‌ట‌. అందులో భాగంగా ప‌వ‌న్ త‌న 28వ సినిమాను డైరెక్ట‌ర్ హరీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ 8 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఈ విష‌యాన్ని తెలిపారు. త‌మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న‌ట్లు తెలిపారు.

ఇప్పటికే హ‌రీశ్ శంక‌ర్ ప‌వన్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే ప‌వ‌న్, హ‌రీశ్ సినిమాకు సంబంధించిన ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో వీరి సినిమా రానుంద‌ని టాక్‌. తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ సినిమాలో హీరోయిన్‌గా మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ మాన‌స రాధాకృష్ణ‌న్‌ను ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ అమ్మ‌డు ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌యాళ సినిమా రంగానికే ప‌రిమితం అయ్యారు. మ‌రి తొలి సినిమాకే ప‌వ‌న్‌తో న‌టించే అవ‌కాశం అంటే.. ల‌క్కీ అనే చెప్పాలి. మ‌రి నిజంగానే ప‌వ‌న్ స‌ర‌స‌న ఈ అమ్మ‌డుకి అవ‌కాశం వ‌చ్చిందో రాదో.. ఇందులో నిజా నిజాలేంటో తెలియాంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

ఈసారి 'రాములో రాముల..' అంటోన్న డేవిడ్ వార్నర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.

అనారోగ్యంపై వచ్చిన వార్తలపట్ల కేటీఆర్ క్లారిటీ..

తెలంగాణ మంత్రి కేటీఆర్ అనారోగ్యంగా ఉన్నారని.. గత రెండు మూడ్రోజులుగా ఆయన బాధపడుతున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. కేసులు తగ్గిపోతున్నాయ్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇందుకు నిదర్శనమే గత నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసులు.

మోదీ ఏం చెప్పబోతున్నారు.. దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 08 గంటలకు జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం

అర‌వింద్ రిక్వెస్ట్‌.. ప్ర‌భుత్వం ఒప్పుకుంటుందా?

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం స్తంభించింది. ప‌లు రంగాలు చాలా న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాంటి రంగాల్లో సినీ రంగం కూడా ఒక‌టి. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత థియేట‌ర్స్‌ను మూసివేశారు.