బాల‌య్య చిత్రంలో మ‌ల‌యాళీ భామ‌?

  • IndiaGlitz, [Monday,July 06 2020]

కెరీర్ ప్రారంభం నుండి డిఫ‌రెంట్ సినిమాల‌తో పాటు గ్లామ‌ర్ సినిమాల‌కు ఓకే చెబుతూ వ‌చ్చిన హీరోయిన్ అమ‌లాపాల్‌. మ‌ధ్య‌లో డైరెక్ట‌ర్ విజ‌య్‌ను పెళ్లి చేసుకోవ‌డం, విడిపోవ‌డం అన్నీ జ‌రిగాయి. మ‌ళ్లీ ఇప్పుడు సినిమాల్లో వ‌రుస అవ‌కాశాలనైతే ద‌క్కించుకుంటుంది అమ‌లాపాల్. ప్రారంభంలో ‘నాయ‌క్‌, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో..’ వంటి తెలుగు చిత్రాల్లో న‌టించిన ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ త‌ర్వాత తెలుగులో న‌టించ‌నుందంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం మేర‌కు నందమూరి బాల‌కృష్ణ 106వ చిత్రంలో అమ‌లాపాల్ న‌టించ‌నుంద‌ట‌. ఈ సినిమాలో ఇద్దురు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒక‌రు కొత్త హీరో్యిన్ కాగా.. మ‌రో హీరోయిన్ గురించి యూనిట్ చాలానే అన్వేష‌ణ చేసింది. బాలయ్య హీరోయిన్ అంటూ చాలా పేర్లే వినిపించాయి. ఇప్పుడు ఈ లిస్టులో అమలాపాల్ పేరు చేరింది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

More News

సూర్య‌.. ఎందుక‌లా?

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

విజయ్ ఇంటికి పోలీసులు.. అర్థరాత్రి హైడ్రామా

కోలీవుడ్ స్టార్ విజయ్ ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన పోలీసులు.. ఇల్లంతా గాలించారు. ఉన్నట్టుండి పోలీసులు రావడం సోదాలు నిర్వహిస్తుండటంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు అవాక్కయ్యారు.

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే..

ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు కావాలంటే గగనమే. చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అప్పుడు కానీ దొరికేది కాదు.

ఈ లక్షణాలుంటే మీకు కరోనా ఉన్నట్టే..

రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. అలాగే కరోనా లక్షణాల జాబితా కూడా పెరిగిపోతోంది.

రూట్ మారుస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌..?

మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ మెగాభిమానుల‌ను మెప్పిస్తున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌.