ఒక వ్యక్తిని ప్రేమించా.. బ్రేకప్ జరిగింది: అనుపమ పరమేశ్వరన్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి.
శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అనుపమ తన వ్యక్తిగత విషయాలని బయట పెట్టేది చాలా తక్కువ.
తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనుపమ తన పర్సనల్ లైఫ్ ఓ జరిగిన సంఘటనని బయట పెట్టింది. తన లవ్ ఎఫైర్ గురించి రివీల్ చేసింది ఈ మలయాళీ బ్యూటీ. అభిమాని అనుపమ లవ్ లైఫ్ గురించి అడగగా.. గతంలో తాను ఓ వ్యక్తిని చాలా ఇష్టంగా ప్రేమించినట్లు తెలిపింది. కానీ తమ మధ్య బ్రేకప్ కూడా జరిగిపోయిందని అనుపమ రివీల్ చేసింది.
తాను ప్రేమించిన వ్యక్తి వివరాలని మాత్రం అనుపమ రివీల్ చేయలేదు. ఇక టాలీవుడ్ లో హీరో రామ్ పోతినేని తనకు మంచి స్నేహితుడని పేర్కొంది. వీరిద్దరూ ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాల్లో నటించారు. గతంలో అనుమప ప్రేమలో ఉందంటూ కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఆ టైం లో అలాంటిదేమి లేదని అనుపమ చెప్పింది.
ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments