బన్ని సినిమాలో మలయాళ నటుడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. పర భాషా నటులు తెలుగులో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో జయరాం కూడా చేరాడు. మలయాళ సీనియర్ నటుడైన జయరాం గత ఏడాది విడుదలైన `భాగమతి`లో విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది మరో తెలుగు చిత్రంలో నటించబోతన్నారు.
ఆ సినిమా ఏదో కాదు.. బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం. ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో టబు బన్ని తల్లిగా నటిస్తుంటే.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. హారిక అండ్ హాసని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com