Malavika Satishan: 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది: మాళవిక సతీషన్
Send us your feedback to audioarticles@vaarta.com
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ''బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ మాళవిక సతీషన్ విలేఖరు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' కథలో మీకు నచ్చిన అంశాలు ?
సినిమా టైటిల్ చూసి ఇది బోల్డ్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది చాలా క్లీన్ మూవీ. యూ/ఎ మూవీ. నటనకు చాలా ఆస్కారం వుండే సినిమా ఇది. ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కోణాలు చూపించే అవకాశం దొరికింది. చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ వుంటుంది.
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో దివ్య అనే పాత్రలో కనిపిస్తా. నా రియల్ లైఫ్ కి దగ్గరగా వుండే పాత్ర ఇది. చాలా బబ్లీగా వుంటుంది. బేసిగ్గా సినిమాలల్లో అమ్మాయి వెనుక అబ్బాయి తిరుగుతాడు. కానీ ఇందులో అమ్మాయే అబ్బాయి వెనుక తిరుగుతుంది. కథలో మంచి ఎమోషనల్ జర్నీ వుంటుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ వున్న సినిమా ఇది. కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికీ ముందు అనుకున్నట్లే థియేటర్లోనే విడుదల చేస్తున్నాం.
హీరో విశ్వంత్ గురించి చెప్పండి ?
తను ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ ట్రోవర్ట్. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ లా వుంటుంది. నేను జర్రీ(నవ్వుతూ).
ఈ కథలో మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ?
నా కవర్ వీడియో సాంగ్ చూసి డైరెక్టర్ సంతోష్ గారు ఆడిషన్స్ కి పిలిచారు. ఆడిషన్స్ ఇచ్చాను. ఆ పాత్రకు నేను సరిపోతానని ఫైనల్ చేశారు. ఆయనతోనే మరో సినిమా కూడా చేస్తున్నాం.
నిర్మాతలు గురించి చెప్పండి ?
వేణు గారు, నిరంజన్ రెడ్డి గారు ఈ చిత్రానికి బ్యాక్ బోన్స్. వేణు గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.
చూసి చూడంగానే సినిమా తర్వాత గ్యాప్ రావడానికి కారణం ?
నా చదువు ఇప్పుడే పుర్తయింది. చదువు కారణంగా సినిమాల్లో కొంచెం నెమ్మదిగా వున్నా. ఇప్పుడు మూడు సినిమాలు చూస్తున్నా. శివ నాగేశ్వర్ రావు దర్శకత్వంలో దొచేవారెవరురా, అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో మరో సినిమా చేస్తున్నా.
మీ జర్నీలో ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నారు ?
నా జర్నీ చాలా హాయిగా జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ ఎవరినైనా స్వాగతిస్తుంది. తెలుగులో వున్న గొప్పదనం ఇది.
ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు ?
పాత్రల విషయంలో నాకు ఒక విష్ లిస్టు వుంది. డిఫెన్స్ ఆఫీసర్ గా చేయాలని వుంది. అలాగే మంచి స్పోర్ట్ సినిమా, బయోపిక్ చేయాలని వుంది. అలాగే రాజమౌళి గారి సినిమాలో చేయాలని వుంది.
అడవి శేష్ నటన నచ్చుతుంది. అలాగే నాగశౌర్య, అఖిల్ ఇష్టం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout