Jailer:సూపర్‌స్టార్ రజనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ .. వేటకు సిద్ధమైన జైలర్.. రిలీజ్ డేట్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
లేటు వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. తాజాగా ఆయన హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జైలర్’. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. అంతేకాదు.. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో సస్పెన్స్‌కు తెరదించింది జైలర్ యూనిట్.
సినిమా నిండా స్టార్ క్యాస్టింగ్ :
ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో క్యాస్టింగ్ మొత్తాన్ని చూపించారు . బాలీవుడ్ నుంచి జాకీష్రాఫ్, మలయాళం నుంచి మోహన్‌లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి సునీల్, నాగబాబులు కీలకపాత్రలు పోషించారు. అంతేకాదు.. మెజారిటీ క్యాస్టింగ్ అంతా నెగిటివ్ షేడ్స్ వున్న రోల్స్ పోషించినట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవిలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఆగస్ట్ 10న జైలర్ రిలీజ్ :
అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 10న జైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అనిరుద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. అన్నాత్తై మూవీ తర్వాత రజనీ చేస్తున్న సినిమా కావడంతో జైలర్‌పై భారీ అంచనాలు వున్నాయి. మరి తలైవా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో తెలియాలంటే ఆగస్ట్ పది వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు అదే డేట్ నాడు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ కూడా రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ నడిచే అవకాశాలున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com