అసభ్యకరంగా ఉండదంటున్నమేకర్
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లా వుద్దీన్ ఖిల్జీకి, రాణి పద్మావతికి మధ్య ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలనూ చిత్రీకరించలేదని, తనను రాణి పద్మావతి కథ ఎంతో ఇన్‌స్పయిర్ చేయబట్టే ఈ సినిమాను చేశానని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి. దీపికా పడుకొణె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'పద్మావతి'.
ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని నార్త్ ఇండియాలో పలు చోట్ల అల్లర్లు రేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సంజయ్‌లీలా భన్సాలి తొలిసారి నోరు విప్పారు. "రాణి పద్మావతికి సంబంధించిన అంశాలను ఎంతో జాగరూకతో పరిశీలించి, అధ్యయనం చేసి ఈ సినిమాను తెరకెక్కించాను. ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దాను.
రాణి పద్మావతికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచీ ఎందరినో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదల కోసం ఎంతో మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీకి, రాణి పద్మావతికి మధ్య అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటాయని కొంతమంది ఊహించుకుంటున్నారు.
అందులో నిజం లేదు. చాలా బాధ్యతాయుతంగా ఈ సినిమాను తెరకెక్కించాను. ఎక్కడా రాజ్‌పుత్ వంశానికి అగౌరవం కలిగించేలా ఉండదు" అని ఆయన ఓ వీడియోలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com