సినీ జర్నలిజంపై బుక్.. సమాచార సాయం చేయండి!
- IndiaGlitz, [Wednesday,January 29 2020]
తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర తెలుగు సినిమాకు 90 ఏళ్ల చరిత్ర ఉంది. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచే సినిమా పాత్రికేయమూ పుట్టింది. సినిమా పరిశ్రమకూ ప్రేక్షకులకూ మధ్య వారిధిగా నిలుస్తోంది. నాటి నుంచి నేటి దాకా తెలుగు సినిమా జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతూ వచ్చింది. నాటి సినిమా జర్నలిస్టులు, పత్రికలు, టీవీలు మొదలుకుని నేటి వెబ్ జర్నలిజం దాకా ఉన్న చరిత్రను అక్షరబద్ధం చేసే బృహత్తర కార్యక్రమాన్ని నేను చేపట్టాను. ఎంతో సమాచారాన్ని సేకరించాను. నాకు తెలియని సమాచారం కూడా ఉండవచ్చు. అందుకే ఇందులో మిమ్మల్నీ భాగస్వాముల్ని చేయదలిచాను.
సినిమా జర్నలిజానికి సంబంధించి మీకు తెలిసిన ఏ సమాచారాన్ని అయినా నాకు పంపే ప్రయత్నం చేయగలరు. ఆ జర్నలిస్టుల వారసులుగాని, ఔత్సాహికులుగాని ఆ వివరాలను నాకు పంపే ఏర్పాటు చేయగలరు. మీకు తెలిసిన పాతతరం సినిమా జర్నలిస్టుల వివరాలు, పత్రికల వివరాలు, సినిమా జర్నలిజానికి సంబంధించిన మరే ఇతర సమాచారం మీ దగ్గర ఉన్నా వెంటనే మాకు పంపండి. ఇందులో మా మెయిల్ ఐడీ, వాట్యాప్ నంబర్ ఇస్తున్నాను. వాటికి ఆ వివరాలు పంపి సహకరించగలరు. సినిమా రంగానికి సంబంధించి ఇప్పటిదాకా నేను 10 పుస్తకాలు రాశాను. నేను చేస్తున్న ఈ అక్షర యజ్ఞం దిగ్విజయంగా పూర్తికావడానికి మీవంతు సహకారాన్ని మీరూ అందించండి.
- మీ వినాయకరావు
mail id: vinayakaraou@gmail.com
whatsapp number: 7981008708