కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయండి: ఏపీ ఆరోగ్యశాఖ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలో వ్యాక్సినేషన్ కోసం కచ్చితమైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్లకు ఆరోగ్యశాఖ సూచించింది. ముందుగా ఫ్రంట్ లైన్ సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ అందించాలని యోచిస్తోంది. కాగా.. ఈ ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో హెల్త్ కేర్ వర్కర్లతో పాటు పోలీసులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖల సిబ్బందిని కూడా చేర్చింది.
50 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారికి సైతం వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. కాగా.. ప్రతి కేంద్రం నుంచి ఐదుగురు వ్యాక్సినేషన్ అధికారులను గుర్తించాలని కలెక్టర్లకు తెలిపింది. ఈ మేరకు ప్రతి జిల్లాలోనూ కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ వైద్యులతో ఒక ప్రత్యేక కమిటీని అందుబాటులో ఉంచాలి. వ్యాక్సినేషన్ సెంటర్లంటినీ ముందుగానే మ్యాపింగ్ చేసి సమీప పీహెచ్‌కి అనుసంథాంనం చేయాలి. అలాగే ఏరియా ఆసుపత్రుల్లో 10 పడకలు సైతం అందుబాటులో ఉంచాలి.
టీకా కేంద్రాలతో పాటు రీజినల్, జిల్లా వ్యాక్సిన్ స్టోర్లు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని ఏపీ ఆరోగ్యశాఖ కలెక్టర్లకు సూచించింది. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్స్‌తో పాటు కాల్ సెంటర్లను సైతం ఏర్పాటు చేయాలి. ఆయా కంట్రోల్ రూమ్స్‌లో డీఐవో, డీపీఎంవో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీటీసీ, ఏపీఎస్ఆర్టీసీ అధికారి, ఎలక్ట్రిసిటీ అధికారి, జిల్లా కలెక్టర్ నియమించిన వైద్యుల కమిటీ 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 25 నాటికి ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆరోగ్యశాఖ ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com