Majority of Seats:మెజార్టీ సీట్లు రాకపోతే ఎలా..? మంతనాల్లో నిమగ్నమైన పార్టీలు..

  • IndiaGlitz, [Saturday,December 02 2023]

మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో రేపటితో తేలిపోనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌లో మెజార్టీ సంస్థలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. కొన్ని సంస్థలు హంగ్ వస్తాయని ప్రకటించాయి. దీంతో అధికారం చేపట్టడానికి అవసరమైన సీట్లు రాకపోతే ఏం చేయాలనే దానిపై పార్టీలు తీవ్ర మంతనాలు జరుపుతున్నాయి. పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే ఏం చేయాలి..? అనే దానిపై అన్ని పార్టీల నేతలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా మేజిక్ ఫిగర్ రాకపోతే... గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలను వెంటనే కర్ణాటకకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఈ బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయన రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఇక్కడే ఉండి ఫలితాలను అబ్జర్వ్ చేయనున్నారు. మేజిక్ ఫిగర్ రాకపోతే ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు అవసరమైన స్థానాల కోసం ఎంఐఎం పార్టీతోనూ సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమయ్యారట.

ఇక అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో మెజార్టీపై తీవ్ర చర్చ జరుగుతోందని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో తమ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో తదుపరి కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నారు. అధికారానికి రావాల్సిన 60 సీట్లు రాకుండా 50 లోపే ఆగిపోతే ఏం చేయాలన్న దానిపై గులాబీ బాస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఎంఐఎం మద్దతు తీసుకోవడంతో పాటు కాంగ్రెస్, బీజేపీల్లో తమకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

More News

Congress:ఇండియా టుడే సర్వేలోనూ కాంగ్రెస్‌కే పట్టం.. సీఎంగా మొగ్గు ఎవరికంటే..?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీంతో తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.

Animal:బాక్సాఫీస్‌పై రణ్‌బీర్ వైల్డ్‌నెస్.. దుమ్మురేపిన 'యానిమల్' కలెక్షన్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకడు సందీప్ రెడ్డి వంగా కాంబో వచ్చిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

Bigg Boss Telugu 7 : శెభాష్ అర్జున్ .. వైల్ట్‌కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి , గ్రాండ్ ఫినాలే‌కి ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచి

బిగ్‌బాస్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫినాలే అస్త్ర కోసం పోటీ జరుగుతోంది.

Chandrababu:జిల్లాల పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇక పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు.

Andhra:కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాన్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.