'మేజర్ చంద్రకాంత్’కి 25 ఏళ్ళు
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కెరీర్లో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ‘మేజర్ చంద్రకాంత్’ ఒకటి. ఎన్టీఆర్ కాంబినేషన్లో తొలిసారిగా ‘అడవి రాముడు’ (1977) సినిమాని తెరకెక్కించి సంచలన విజయం అందుకున్న కె.రాఘవేంద్రరావు.. ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 12వ సినిమా ఇది. వీరి కలయికలో వచ్చిన 12 చిత్రాల్లో ఏడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయంటే..
ఈ కాంబినేషన్‌కి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. తమ కాంబినేషన్లో వచ్చిన తొలి, ఆఖరి చిత్రాలు ఘనవిజయాలు సాధించడం అనేది అపూర్వమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ కెరీర్లో చివరి హిట్‌గా నిలిచిన ఈ సినిమాని శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు. మోహన్ బాబు సంస్థలో ఎన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ సినిమాకి తొలిసారి స్వరాలను అందించిన కీరవాణి.. తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్ళారు. ఇందులోని పాటలన్నీ అప్పట్లో పెద్ద హిట్. ముఖ్యంగా.. జాలాది కలం నుంచి జాలువారిన దేశభక్తి గీతం “పుణ్యభూమి నా దేశం” అయితే ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది.
ఈ పాటలో ఎన్టీఆర్ అభినయానికి బాలు గాత్రం తోడవడంతో.. పాట చిరస్థాయిగా నిలిచిపోయింది. కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్, దేశభక్తి, కుటుంబ విలువలు.. ఇలా అన్ని అంశాలను సమపాళ్లలో రంగరించి ఈ సినిమాని పదికాలాల పాటు గుర్తుండిపోయేలా రూపొందించారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. 1993 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రం.. నేటితో 25 సంవత్సరాలను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments