నాగ చైతన్య మూవీ టైటిల్ మజ్ను కాదు...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి టైటిల్ మజ్ను అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మలయాళ టైటిల్ ప్రేమమ్ నే ఫిక్స్ చేసినట్టు సమాచారం. డిసెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రేమమ్ తెలుగులో ఎలాంటి సంచలన స్రుష్టిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments