నాని, విరించి వర్మ ల మజ్న ఆడియో విడుదల

  • IndiaGlitz, [Monday,September 05 2016]

నేచురల్‌ స్టార్‌ నాని, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం మ‌జ్ను. ఈ చిత్రాన్నిఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్ బ్యాన‌ర్స్ పై పి.కిరణ్‌, గోళ్ళ గీత సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. మ‌జ్ను బిగ్‌ సీడీని ఏషియన్‌ మూవీస్‌ నారాయణ దాస్‌ విడుదల చేయగా, ఆడియో సీడీలను హీరో నాని విడుదల చేసి తొలి సీడీని హీరో రాజ్‌ తరుణ్‌కు అందించారు.ఇక మ‌జ్ను థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, అనీల్‌ సుంకర విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.... అందరూ అనుకుంటున్న‌ట్లుగా బాధలో ఉండే మజ్ను కథ ఈ సినిమా కాదు ఇది. ప్రేమలో పడి సమస్యల్లో ఉన్నట్లు కనపడే ఎవరినైనా మజ్ను అనే అంటాం. ఇక మా మజ్ను సినిమా విషయానికి వస్తే... బోర్‌ కొట్టదు. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఇంటికి వెళ్ళినా గుర్తుకు వస్తుంటాడు. ఉయ్యాలా జంపాలా కథను దర్శకడు విరించి వర్మ ముందు నాకే చెప్పాడు. నాకు విరించి వ‌ర్మ‌తో ఉయ్యాలా జంపాలా సినిమా ముందు నుంచి నుండి మంచి పరిచయం. తను చాలా మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి.
తన నిజాయితీ తన సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌లో కనపడుతుంది. ప్రేక్షకులు అందుకే తన సినిమాను తమదిగా భావిస్తారు. అందుకే ఉయ్యాలా జంపాలా పెద్ద హిట్‌ సాధించింది. కిరణ్‌గారు, గీతగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నాకు అష్టాచమ్మా రోజులు గుర్తుకు తెచ్చిన సినిమా ఇది. యూనిట్‌ సభ్యులందరితో ఒక సభ్యుడిగా కలిసిపోయి ఈ సినిమా కోసం పనిచేశాను. హీరోయిన్స్‌ అనుఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీలు చక్కగా న‌టించారు చేశారు. గోపీ సుందర్‌తో భలే భలే మగాడివోయ్‌ తర్వాత చేస్తున్న మూవీ ఇది. నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తూ వ‌ర్క్ చేశాం. ఉయ్యాలా జంపాలా కంటే మా మ‌జ్ను చిత్రం పెద్ద విజ‌యం సాధిస్తుంది అన్నారు.
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ.... మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా..? ప్రేమా? అనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాగే ప్రేమలో వున్నప్పుడు అది ఎన్ని రోజులు వుంటుందనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో ఈ మజ్ను చిత్రాన్ని రూపొందించాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాంటిక్‌ ఫీల్‌ వున్న చిత్రం మ‌జ్ను అన్నారు.
సంగీత దర్శకుడు గోపిసుందర్‌ మాట్లాడుతూ... 'లవ్‌కి, మ్యూజిక్‌కి లాంగ్వేజ్‌ అవసరం లేదు. నాని ఈ సాంగ్స్‌ విని నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ని ఇచ్చారని అనడం సంతోషాన్ని కలిగించింది. రామజోగయ్యశాస్త్రి మంచి లిరిక్స్‌ ఇచ్చారు. దర్శకనిర్మాతలు లవ్‌ అండ్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ... కిరణ్‌గారు చేసిన అంత:పురం, నువ్వు నేను, బీరువా సినిమాలను చూస్తే ఆయన స్క్రిప్ట్‌ విషయంలో చాలా సెలెక్టివ్‌గా వుంటారని తెలుస్తుంది. ట్రైలర్‌ చూస్తుంటే సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్‌ అవుతుందనిపిస్తుంది. నాని వరసగా నాలుగు హిట్స్‌ కొట్టాడు. ఇది తనకు ఐదో హిట్‌ అవుతుంది అన్నారు.
నిర్మాత అనీల్‌ సుంకర మాట్లాడుతూ... నాని 100% సక్సెస్‌ మూవీస్‌నే చేస్తూ వస్తున్నాడు. నాని దర్శకనిర్మాతల హీరో. తన సినిమాలు అందరూ చూసే విధంగా వుంటాయి. నిర్మాత కిరణ్‌గారి విషయానికి వస్తే మంచి కథల్నే సినిమాలుగా చెయ్యడానికి ఆయన ఆసక్తి చూపిస్తారు. గోపీసుందర్‌గారి మ్యూజిక్‌ ఫ్యాబులస్‌గా వుంది. నాని సెకండ్‌ హ్యాట్రిక్‌ కంటిన్యూ అవుతుంది అన్నారు.
నిర్మాత ఎన్‌.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... నాని హార్డ్‌ వర్క్‌ చేసే హీరో. ఆనంది ఆర్ట్స్‌ జెమిని కిరణ్‌గారు, గోళ్ళ గీతగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ హను రాఘవపూడి మాట్లాడుతూ... నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. తను అందరికీ కంఫర్టబుల్‌గా వుండే హీరో. అలాగే మంచి కథల్ని ఎంచుకుంటూ మంచి కమిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తూ వుంటాడు. ఈ సినిమా తనకి, విరించి వర్మకు, నిర్మాతలకు పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ... నాని ఫెయిల్యూర్‌ వచ్చినా చాలా పాజిటివ్‌గా ఆలోచించే హీరో. తనతో భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ సినిమా చేశాను. తనతో పనిచేస్తున్నప్పుడు సొంత సినిమాకి పనిచేస్తున్న ఫీల్‌ కలుగుతుంది. విరించి వర్మ తన టేస్ట్‌కి తగ్గ సినిమాలు చేస్తూ వస్తున్నారు. గోపిసుందర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాతలకు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ.... ముద్దు పేరునే స్క్రీన్‌ పేరుగా మార్చుకున్న హీరో. తనతో ఎప్పుడో సినిమా చెయ్యాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. నాని సినిమాలు ఎంటర్‌టైన్‌ చేస్తాయని కాకుండా, నానియే ఎంటర్‌టైన్‌ చేస్తాడు అనే రేంజ్‌కి ఎదిగాడు. అలాగే కిరణ్‌గారి జడ్జిమెంట్ పై నాకు నమ్మకం వుంది. గీత గారు ఎంతో ప్యాషన్‌తో ఈసినిమాను నిర్మించారు. విరించివర్మకు మరో మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ... ఎనిమిది సంవత్సరాల క్రితం నాని తొలి చిత్రం అష్టా చమ్మా సెప్టెంబర్‌ 5న విడుదలైంది. ఇప్పుడు అదే నెలలో ఆడియో, సినిమా రిలీజ్‌ అవుతోంది. మంచి ప్యాషన్‌ వున్న హీరో. దర్శకుడు విరించివర్మ, నిర్మాతలు కిరణ్‌, గీతలకు ఎంటైర్ టీమ్‌కి ఆల్‌ది బెస్ట్ అన్నారు.
న‌టుడు, ద‌ర్శ‌కుడు అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ... నేను, నాని ఒకే సినిమాతో పరిచయమయ్యాం. ఇప్పుడు మా ఇద్దరి సినిమాలు ఒకే నెలలో రిలీజ్‌ అవ్వడం హ్యాపీగా వుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి యూనిట్‌లోని ప్రతి ఒక్కరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏషియన్‌ నారాయణ దాస్‌, సునీల్‌, రాజ్‌ తరుణ్‌, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీ, గోళ్ళ గీత, పి.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

More News

పవన్ 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని క్రియాశీలకం చేస్తున్నాడు.గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి అండగా నిలబడ్డ

దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న 'హ్యాపీ బర్త్ డే'

చెన్నమనేని శ్రీధర్,జ్యోతీసేథీ,సంజన,శ్రవణ్ కీలక పాత్రధారులుగా శ్రీనందన్ మూవీస్ పతాకంపై పల్లెల వీరారెడ్డి(చేగువేరా) దర్శకత్వంలో

మిలియన్ డాలర్ల క్లబ్ లోకి 'జనతా గ్యారేజ్'

ఎన్టీఆర్ మరోసారి ఓవర్ సీస్ లో తన హవాను కొనసాగిస్తున్నాడు.టెంపర్,నాన్నకు ప్రేమతో చిత్రాలతో మిలియన్ డాలర్ల మార్కును

మంచు లక్ష్మిని కలవాలి.. అదే నా చివరి కోరిక!

'మేము సైతం' బుల్లితెరపై ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే.

ప్రారంభమైన 'ప్రణయం'

శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై ఎ.నరేందర్,విజయానంద్,సురేష్ గౌడ్ నిర్మాతలుగా జి.ఎస్.వి.సత్యప్రసాద్ దర్శకత్వంలో దిలీప్(నూతన పరిచయం),పూనమ్ కౌర్,అక్షిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం 'ప్రణయం'.