యువత మనసు దోచుకున్న ‘మజిలి’!
Send us your feedback to audioarticles@vaarta.com
శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా ‘మజిలి’. ఆదివారం నాడు సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, నటీనటులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మొదట ‘మజిలి’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ కోసం ఎన్నోరోజులుగా వేచి చూసిన అక్కినేని, సమంత అభిమానులు అది కాస్త రిలీజ్ అవ్వడంతో ఆనందంలో మునిగి తేలారు.
ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ 1,498,131 వ్యూస్ దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. "మనం లవ్ లెటర్ మీద రాసే అమ్మాయి పేరు వెడ్డింగ్ కార్డ్ మీద ఉండదు రా.." అనే డైలాగ్ యువత మనసు దోచుకుంది. ఈ ఒక్క డైలాగ్ అనే కాదు.. ట్రైలర్‌లో మిగిలిన డైలాగ్స్ సూపర్బ్ అనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో రెండు నిమిషాల ట్రైలర్‌లోనే దర్శకుడు చూపించేశారు. ముఖ్యంగా లవర్స్ ఈ ట్రైలర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ అక్కినేని, సినీ ప్రియులే కాదు స్టార్ హీరోల మన్ననలు పొందడం విశేషమనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
మెచ్చుకున్న మామయ్య!!
కాగా.. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘మజిలీ టీజర్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నా. ట్రైలర్ చూడగానే చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవుతుందని అనుకున్నా. ఏప్రిల్ 5న ఫ్యాన్స్ ఉగాది పెద్ద పండుగను చేసుకోవచ్చు. ఇది వండర్ ఫుల్ సినిమా కావాలి. ఇలాంటి సినిమాల్లో చైతూ, సామ్ వండర్‌ఫుల్ జాబ్ చేస్తారు’ అని వెంకీ చెప్పడంతో రియల్ దంపతులు చైతు, సామ్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments