పూర్ణ‌, శ్రావ‌ణిల ప్ర‌యాణ‌మే 'మ‌జిలీ'

  • IndiaGlitz, [Monday,March 04 2019]

నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'మ‌జిలీ'. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మంత‌తో పాటు దివ్యాంశిక కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

సినిమా గురించి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ..సినిమా చూసే ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే మ‌ధ్య త‌ర‌గ‌తి భ‌ర్త‌గా ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పూర్ణ‌ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఈయ‌న పాత్ర ఇన్‌టెన్స్‌గా, వైవిధ్యంగా ఉంటుంది. అలాగే స‌మంత అక్కినేని శ్రావ‌ణి అనే అమ్మాయిగా క‌న‌ప‌డుతుంది. ఈమె త‌న న‌ట‌న‌తో న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది. సినిమాను వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీక‌రించాం. ఇదొక ఎమోష‌నల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌.సినిమాలో న‌టించిన మ‌రో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందన్నారు.

రసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ఎనిమిది మిలియ‌న్ వ్యూస్‌తో ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది.

More News

రాయలసీమ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నాదే..

"రాయ‌ల‌సీమ చ‌దువుల నేల‌. అన్నమయ్య, వెంగ‌మాంబ‌, వీరబ్రహ్మేంద్రస్వామి, పీర్ బాబా వంటివారు తిర‌గాడిన నేల‌. ఇలాంటి నేల‌కు ముఠా, వ‌ర్గ పోరుతో కొన్నికుటుంబాలు

చంద్రబాబు దమ్ముంటే ఎదుర్కో..: కేటీఆర్ సవాల్

గత మూడ్రోజులుగా జరుగుతున్న డేటా వార్ తెలంగాణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు ప్రధాన పార్టీలూ సీరియస్‌గా తీసుకున్నాయి.

మ‌హేష్ మూవీ టైటిల్ `వాట్స‌ప్‌`?

మ‌హేష్ నెక్స్ట్ మూవీ గురించి సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెక్క‌ర్లు కొడుతోంది. మ‌హేష్ ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌టిస్తున్నారు.

నాగ‌శౌర్య జ‌త‌గా షాలినీ!

నిన్న‌మొన్న‌టిదాకా నిలిచి నిదానంగా సినిమాలు చేసిన అర్జున్‌రెడ్డి భామ ఇప్పుడు స్పీడు పెంచింది. మేఘ పాత్ర‌లో '118'లో ఈ భామ క‌నిపించింది. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్

స‌మంత ఇప్పుడు 'జాన‌కి దేవి'

స‌మంతను అంద‌రూ కొత్త‌గా జాన‌కీ, జాన‌కీదేవి అని పిలుస్తున్నార‌ట‌. స‌మంత  పేరు మార్చుకుందా?  జాన‌కి దేవి అని ఎందుకు పిలుస్తున్నారు. అని ఆస‌క్తిగా ఉందా..