బాలయ్య-బోయపాటి సినిమా నుంచి ప్రముఖ టెక్నీషియన్ ఔట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలయ్య-బోయపాటి సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట బడ్జెట్ .. ఆ తర్వాత రెమ్యునరేషన్ గొడవ.. ఆపై స్క్రిప్ట్ వర్క్.. ఇలా ప్రతీది ఈ సినిమాకు ఆటంకంగా మారింది. ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ తప్పుకున్నారట. ఈయన బాలయ్య తాజా డిజాస్టర్ ‘రూలర్’ సినిమాకు కూడా పని చేశారు. అంతకు ముందు మరికొన్ని సినిమాలకు పని చేశాడు. విచిత్రం ఏంటంటే.. ‘రూలర్’ విడుదల సమయంలో రామ్ ప్రసాద్‌ను బాలయ్య ఆకాశానికెత్తాడు. కానీ ఇప్పుడు అదే బాలయ్య సినిమా నుంచి ఆయన వెళ్లిపోయాడు.
అంతర్గత సమాచారం ప్రకారం.. ఆయనను తప్పించమని నిర్మాతలను బాలయ్యే కోరారట. సెంటిమెంట్లను బాగా నమ్మే ఈ నందమూరి నటసింహం.. వరుస ప్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఏమాత్రం పసలేని కథతో రూలర్ తీసి.. తొలిరోజే పని అయిపోయిందన్న టాక్ తెప్పించుకున్నాడు. దీంతో మళ్లీ బోయపాటినే నమ్ముకున్న బాలయ్య.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికోసం భారీగానే కసరత్తులు చేస్తోంది ఈ చిత్రబృందం. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com