Rameswaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారులు అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారులను ఎన్‌ఐఏ(NIA) అధికారులు పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేశారు. ఈ పేలుడు కేసులో అబ్దుల్ మతిన్‌ను మాస్టర్ మైండ్‌గా గుర్తించారు. పేలుడుకి కుట్రధారిగా మతిన్ వ్యవహరించాడని .. అతడి ఆదేశాల మేరకు ముసవీర్‌తో కలిసి మరో ఇద్దరు పేలుళ్లకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరూ ఇప్పటికే ఓ టెర్రరిస్ట్ ఎటాక్ కేసులో వాంటెడ్‌గా ఉన్నారు. బెంగళూరులోని ఐసిస్ మాడ్యూల్‌తో అబ్దుల్ మతీన్‌కి లింక్స్ ఉన్నాయని NIA గుర్తించింది. నకిలీ గుర్తింపు కార్డులతో ఓ చోట తలదాచుకుంటున్నాడని వెల్లడించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు వెస్ట్‌బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. మార్చి 29వ తేదీన నిందితుడి వివరాలు, ఫొటోలు విడుదల చేసింది పేలుడు తర్వాత నిందితులు కోల్‌కతాలో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ.. అనుమానితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని ప్రకటించింది. కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడు వేషాలు మార్చి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో బస్సులో ప్రయాణించిన ఫోటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. మతీన్ బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్లి షబ్బీర్ అనే యువకుడ్ని కలిశాడు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు అతడి సహకారం తీసుకున్నట్టు విచారణలో తేలింది. ఎట్టకేలకు కోల్‌కతాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ ఏడాది మార్చి 1వ తేదీ ఉదయం 11.55 గంటలకు రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్ జరిగింది. కేఫ్‌లోకి భుజానికి బ్యాగు తగిలించుకుని వచ్చిన నిందితుడు ఇడ్లీ ఆర్డర్ చేసి.. ఆర్డీఎక్స్ ఉన్న బ్యాగును వదిలిపెట్టి వెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. తొలుత ఈ కేసును కర్ణాటక పోలీసులు విచారించారు. అయితే విచారణలో బాంబ్ బ్లాస్ట్ అని తేలడంతో దీని వెనక ఉగ్రవాదుల హస్తం ఉందని భావించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐకీ అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్‌ఐఏ వివిధ కోణాల్లో విచారించి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com