'మ‌హిళా క‌బ‌డ్డి' చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్‌

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మ‌హిళా క‌బ‌డ్డి'. ర‌చన స్మిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే మూడ‌వ‌ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కోసం ఉగాది పండుగ పై ఒక ప్ర‌త్యేక పాట‌ను సంగీత ద‌ర్శ‌కుడు బోలే షావ‌ళి సంగీత సార‌థ్యంలో రూపొందించ‌డం జ‌రిగింది.ఈ పాట‌ను ఉగాది పండుగ సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో 'మా' అధ్య‌క్షుడు శివాజీరాజా చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. "ఆర్.కె.ఫిలింస్ అంటే నా సొంత బేన‌ర్ లాంటిది. నా కెరీర్ ప్రారంభ ద‌శ‌లో ఈ బేన‌ర్ లో నటించాను. అప్ప‌టి నుంచి మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఉగాది పండుగ సంద‌ర్భంగా ఉగాది పండుగ పై చేసిన పాటను నేను లాంచ్ చేయ‌డం చాలా ఆనంద‌గా ఉంది. బోలే షావ‌ళి అద్భుతంగా రాసి, కంపోజ్ చేయ‌గా వ‌రం అనే నూత‌న గాయ‌ని ఎంతో విన‌సొంపుగా పాడింది. ఈ పాట‌తో ఉగాది పండుగ ముందే వ‌చ్చిన‌ట్టుగా అనిపిస్తోంది. ఈ పాట‌లా సినిమా కూడా అద్భుతంగా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతోందని" అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ..."మా బేన‌ర్ లో చాలా గ్యాప్ త‌ర్వాత నేను ద‌ర్శ‌కత్వం వ‌హిస్తూ నిర్మిస్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రంలోని ఉగాది పండుగ పై వ‌చ్చే ప్ర‌త్యేక పాట‌ను బోలే రాసి, కంపోజ్ చేయ‌గా వ‌రం అనే నూత‌న గాయ‌ని అద్భుతంగా ఆలపించింది. మ‌హిళ‌లు ఎందులో త‌క్కువ కాద‌నే కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఒక ప‌ల్లెటూరు అమ్మాయి భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డే స్థాయిలో క‌బ‌డ్డీ ఛాంపియ‌న్ గా ఎలా ఎదిగింద‌నేది మెయిన్ క‌థాంశం.

ర‌చ‌న స్మిత్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్నారు. శివాజీ రాజాగారు కూడా ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మా బేన‌ర్ తొలి హీరో అయిన శివాజీ రాజాగారి చేతుల మీదుగా మా చిత్రంలోని తొలి పాట లాంచ్ చేయ‌డం చాలా సంతోషం. అలాగే మా చిత్రంలో ఫేమ‌స్ సింగ‌ర్ మంగిలి కూడా ఒక పాడ పాడారు. రాజ్ కిర‌ణ్ కంపోజ్ చేసిన ఆ పాట‌ను ఉగాది పండుగ త‌ర్వాత రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

తెలుగు ఫిలిం చాంబ‌ర్ సెక్ర‌ట‌రీ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ...."ఉగాది పై చేసిన పాట యుగాది పండుగలా అద్భుతంగా ఉంది. యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు" అన్నారు.

ఏడిద శ్రీరామ్ మాట్ల‌డుతూ..."చిన్న చిత్రాల‌ను ఆద‌రించే ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ చేస్తోన్న ప్ర‌య‌త్నం ఫలించాలి. టైటిల్ లాగే పాట అద్భుతంగా ఉంద‌ని"అన్నారు.

సింగ‌ర్ వ‌రం మాట్లాడుతూ... "ఈ చిత్రంలో ఒక మంచి పాట‌ను పాడే అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌తాని రామ‌కృష్ణ‌గారికి, బోలే గారి నా ధ‌న్య‌వాదాలు"అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు బోలే షావ‌ళి మాట్లాడుతూ..."ఉగాది పండుగ పై పాట రాసి , కంపోజ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌తాని గారికి నా ధన్య‌వాదాలు" అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.​

More News

మార్చి 23న గులేబకావళి

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్

నేను నా సాహితీ ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసాను-ఎన్నో పురస్కారాలు ,అభినందనలు అందుకున్నాను-కాని ఈ ఎంత సక్కగున్నావే పాటకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం.

'రాజరథం' లో ఆర్య లుక్ కి సుదీప్ ప్రేరణ

'రాజరథం' లో విశ్వ గా ఆర్య ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రావడం, ఆ లుక్ పాత్ర మీద అంచనాలు పెంచింది. ఆ లుక్ వాస్తవానికి ఈగ, బాహుబలి ఫలే కిచ్చ సుదీప్ నుండి ప్రేరణ పొంది రూపొందించినది.

'రాజుగాడు' టీజ‌ర్ అప్‌డేట్‌

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్'.. ఇలా వరుసగా యూత్‌ఫుల్‌ సినిమాలతో యూత్‌కు బాగా దగ్గరైన హీరో రాజ్ తరుణ్.

ర‌జ‌నీ కోస‌మే ఒప్పుకున్నాడ‌ట‌

డైలాగులు చెప్ప‌డంలో త‌న‌కు తానే సాటి. ఆయ‌న‌ మాటలు పలికే శైలికి ప్రేక్షకలోకం దాసోహం అంటుంది. ఆయనే.. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పాటేకర్. ఈ నటుడు తొలిసారిగా 'కాలా' చిత్రం ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.