Shaitan Trailer: 'సైతాన్' ట్రైలర్ : వామ్మో.. నెక్ట్స్ లెవల్‌లో క్రైమ్ సీన్లు, బూతులు, బోల్డ్ కంటెంట్

  • IndiaGlitz, [Monday,June 05 2023]

డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ అభిరుచి వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మహి వీ రాఘవ. ఆనందో బ్రహ్మా వంటి కామెడీ చిత్రంతో తన టాలెంట్ నిరూపించుకున్న ఆయన తర్వాత ఎవరు ఊహించని ప్రాజెక్ట్ అందుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాదయాత్ర ఇతివృత్తంగా ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించారు. తద్వారా తాను ఎలాంటి జోనర్‌లోనైనా సినిమాలు చేయగలనని మహి ప్రూవ్ చేసుకున్నారు. అనంతరం వెబ్ సిరీస్‌లలోనూ ఎంట్రీ ఇచ్చి ‘‘సేవ్ ది టైగర్స్’’ పేరుతో కడుపుబ్బా నవ్వించారు. ప్రతి ఇంట్లో మొగుడు పెళ్లాల మధ్య జరిగే సన్నివేశాలను ఇతివృత్తంగా తీసుకుని తన హ్యూమర్‌తో ఆకట్టుకున్నారు రాఘవ.

వెన్నులో వణుకు పుట్టించేలా సీన్లు :

అయితే ఈసారి ఆయన క్రైమ్ జోనర్‌ను ఎంచుకున్నారు. రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వెబ్ కంటెంట్ ‘‘సైతాన్’’. పొలిటికల్, క్రైమ్ థ్రిల్లర్‌గా ఇది నిర్మిస్తున్నారు. తాజాగా సైతాన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో క్రైమ్ కంటెంట్ నెక్స్ట్ లెవల్‌లో వుంది. ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ చూపించని విధంగా వెన్నులో వణుకు పుట్టించేలా సన్నివేశాలు వున్నాయి. హింస, బోల్డ్ కంటెంట్, బూతు డైలాగ్స్ మితిమీరిన విధంగా వున్నాయి.

పీకలు కోసేయ్యడమే :

ట్రైలర్ ప్రారంభం కాగానే.. ఓ పెద్దావిడ.. ‘తప్పట్లేదమ్మా మమ్మల్ని క్షమించమ్మా, కళ్లు మూసుకోఅంటూ ఓ యువతి పీక కోసేస్తుంది. ఆ వెంటనే నరుక్కోవడం, పీకలు కోసేయడం వంటి సీన్లు బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి. ‘‘ఈ సమాజం నన్నొక నేరస్థుడిని అంది.. కానీ నేనొక బాధితుడిని’’ . ‘‘మనలో ఒక్కడిని కాపాడుకోవడం కోసం , ఎవరినైనా, ఎంతమందినైనా చంపాల్సిందే’’ .‘‘రాజకీయ నాయకులు పోలీసులు లాంటి వాళ్లకి విశ్వాసం, కృతజ్ఞతల్లాంటివి వుండవు రా’’ అనే డైలాగ్స్ బాగున్నాయి. నక్సలైట్లు , పోలీసులు, ప్రతీకారాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుందనిపిస్తోంది. తనకు అన్యాయం చేసిన కొందరు వ్యక్తులపై ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 15 నుంచి ‘‘సైతాన్’’ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో కామాక్షి భాస్కర్ల, రిషి, దేవయాని, జాఫర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ జోనర్లను ఇష్టపడేవాళ్లందరికీ ఈ వెబ్ సిరీస్ తప్పక నచ్చుతుంది.

More News

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక మరియు మెమోరియల్‌ అవార్డ్స్‌

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు,

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ వెనుక జనసేనాని.. వ్యూహాల్లో పవన్ నిపుణుడు కాక ఇంకేంటి , విశ్లేషకుల మాట ఇదే

ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ఆయన

Nadendla Manohar: హెలికాఫ్టర్‌లో వెళ్లడమే .. జనం గోడు పట్టదు: జగన్‌ పాలనపై నాదెండ్ల విమర్శలు

పదవీ కాలం పూర్తయ్యే సరికి ఎన్ని కోట్లు మిగిలాయి? ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నాం అని ఆలోచించే వారి కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ నడుస్తోందన్నారు

Train Derailment: ఒడిషాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్

గత శుక్రవారం ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే . ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Nadendla: రాష్ట్ర విభజన... తెలంగాణ ముందుకు, ఏపీ వెనక్కు .. అంతా పవన్ చెప్పినట్లే : నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతగా నష్టపోతుందో పవన్ కళ్యాణ్ చెప్పినట్లే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.