బుర్రిపాలెంలో మహేష్ బాబు వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్

  • IndiaGlitz, [Monday,May 31 2021]

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో సెలెబ్రిటీలు తమ వంతుగా ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మహేష్ బాబు తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు.

ఈ వాక్సినేషన్ డ్రైవ్ ద్వారా మహేష్ బుర్రిపాలెం గ్రామ ప్రజలందరికి వాక్సిన్ అందించబోతున్నారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్ వారి సహకారంతో మహేష్ ఈ డ్రైవ్ ని సొంతంగా స్పాన్సర్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: తండ్రికి మహేష్ బ్యూటిఫుల్ విషెష్.. నమ్రత ఎమోషనల్

'మన జీవితాలు మళ్ళీ నార్మల్ కావాలంటే వాక్సినేషన్ ఒక్కటే ఆశాకిరణం. నా వంతు భాద్యతగా ఈ కార్యక్రమాన్ని బుర్రిపాలెంలో నిర్వహిస్తున్నా. ఆంధ్ర హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు' అని మహేష్ తెలిపారు.

మహేష్ బాబు ఇప్పటికే బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ ఇప్పటి వరకు వందలాది మంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీ చేయించి రియల్ హీరో అనిపించుకున్నారు. బుర్రిపాలెంలో వాక్సినేషన్ డ్రైవ్ ఆరు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.