నేను మాస్క్ ధరించా.. మరి మీరు..? : మహేశ్

  • IndiaGlitz, [Friday,May 22 2020]

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. వ్యాక్సిన్ ఎప్పుడు రెడీ అవుతుందో తెలియకపోవడంతో జనాలు బిక్కిబిక్కి మంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే లాక్ డౌన్ ఉన్నప్పటికీ దేశంలో చాలా వరకూ సడలింపులు ఇచ్చేయడంతో ఎక్కడ జన జాతరే ఉంది. ఈ తరుణంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘మాస్క్ తప్పకుండా వాడండి.. నేను వాడుతున్నా.. మరి మీరు’ అని చెబుతూ అభిమానులు, ప్రజలను ఉద్ధేశించి పలు కీలక సూచనలు చేశాడు.

ఇలాంటి టైమ్‌లో మాస్క్ మస్ట్!

‘కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపులతో క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో మాస్కులు తప్పనిసరి. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కులు ధరించండి. దీనివల్ల మనతో పాటు ఇతరులను రక్షిస్తున్న వారమవుతాం. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోంది. ఇటువంటి సమయంలో మాస్కులు ధరించడం చాలా మంచిది. నేను మాస్కు ధరించాను.. మరి మీరు?’ అని మహేశ్‌ బాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఇందుకు పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ తప్పకుండా.. సార్ మేము మాస్క్‌లు వాడుతున్నాం.. వాడతాం కూడా అని కామెంట్స్ చేస్తున్నారు.