బిగ్‌బాస్ హౌస్‌లో ‘కర్రోడు’ అంటూ గోల.. మహేశ్ సీరియస్!!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్-3 షో రోజురోజుకు రక్తికట్టిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన రెండు సీజన్ల కంటే ఈ సీజన్ మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. సీనియర్ నటుడు, యాంకర్‌గా అపార అనుభవం ఉన్న అక్కినేని నాగ్ షోను విజయవంతంగా నడిపిస్తున్నాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కంటే బిగ్‌బాస్ సూపర్ డూపర్ హిట్టవుతుందని అందరూ భావిస్తున్నారు. అంతే రీతిలో నాగ్ కూడా దుమ్ముదులిపి వదులుతున్నారు.
హేమ వర్సెస్ హిమజ!!
ఇక హౌస్‌లో నాల్గోవ రోజు జరిగిన విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆరుగురు ఎలిమినేషన్‌లోకి వచ్చిన విషయం విదితమే. దీంతో హిమజ, హేమల మధ్య వార్ మొదలైంది. వీరిద్దరూ బాబా భాస్కర్ కామెడీ పండిస్తుండటం ఇప్పటి వరకూ హైలైట్స్‌గా నిలిచాయి. ఇక నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎలిమినేషన్‌లో ఉన్న హేమ కిచెన్‌లో ఆదిపత్యం సాగిస్తున్నారు. ‘టీ’లో షుగర్ తక్కువైందని.. నీళ్లలా ఉందంటూ కంప్లైంట్స్ రావడంతో హేమ సీరియస్ అయ్యింది.
చిన్న పిల్లలుగా మారారు!!
టాస్క్‌లో భాగంగా.. బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చిన్న పిల్లలుగా టీచర్లుగా వ్యవహరించాలని బిగ్ బాస్ కామెడీ టాస్క్ ఇవ్వగా.. అందరూ పిల్లలుగా మారిపోయారు. అయితే 15 మంది కంటెస్టెంట్స్‌లో ఒక్క మహేష్ విట్టా తప్పా మిగిలిన 14 మంది వీర లెవల్లో పెర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖాల నిండా రంగులు పూసుకుని, కాటుక, నల్లబొట్టు పెట్టుకుని రచ్చరచ్చ చేశారు. ఒక కంటెస్ట్ అయితే కిందపడి గిలగిల కొట్టుకున్నారు కూడా. ఈ చిన్నపిల్లలందరికీ టీచర్‌గా ‘ఉయ్యాల జంపాల’ నటి పునర్నవి వ్యవహరించారు. ఈ ఫర్పామెన్స్‌లో ఉండగా.. శ్రీముఖితో సహా రోహిణి, రవిక్రిష్ణ రెచ్చిపోయి నటించి మెప్పించారని చెప్పొచ్చు.
మహేశ్ విట్టా సైలెంట్!!
వీరందరూ ఓకే గానీ మహేశ్ విట్టా మాత్రం సైలైంట్‌గా ఉండిపోయాడు. అయితే ఎందుకిలా చేస్తున్నావ్ అని అడగ్గా.. తాను ఇలాగే ఉంటానని ఓవర్ యాక్షన్ చేయడం రాదని చెప్పుకొచ్చాడు. మరోవైపు.. రవిక్రిష్ణ, రోహిణిలు ఓవరాక్షన్ చేశారు. పడుకుని ఉన్న మహేష్‌ని ఉద్దేశించి ఆ ‘కర్రిగాడు ఊడపొడుస్తా’ అన్నాడు ఇప్పుడు పడుకున్నాడని రవి, రోహిణి ఒకింత వెటకారంగా మాట్లాడారు. దీంతో మహేశ్ బాధపడుతూ ఒక్కసారిగా లేచి సీరియస్ అయ్యాడు.
నన్నే కర్రోడు అంటారా!?
‘నువ్ అసలు చదువుకున్నావా? మహేష్ గాడు అని అను పర్లేదు.. అంతే కాని కర్రోడు అంటూ కించపరిచేలా మాట్లాడతే బాగోదు’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మహేశ్ సీరియస్ అవ్వడంతో దీంతో రవిక్రిష్ణ.. మహేష్‌కు సారీ చెప్పాడు. ఇక టాస్క్‌కి టీచర్‌గా ఉన్న పునర్నవీ భూపాలం.. మహేష్‌ని కన్వెన్స్ చేసి.. మీకు నచ్చినట్టుగా గేమ్ ఆడంటి అంటూ సర్ధిచెప్పింది. ‘నేను చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నాను. నాకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. నన్ను వాడు వీడు అన్నా పర్లేదు కానీ కర్రోడు అంటే కోపం రాదా?’ అంటూ మహేష్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ క్రమంలో తింటున్న అన్నం కూడా రవి పడేశి హంగామా చేశాడు. ఈ ఎపిసోడ్ అంతా వీరిద్దరి పంచాయితీనే సరిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments