మహేష్...కాశీ టు ఢిల్లీ!
Wednesday, March 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ నటిస్తున్న తాజా సినిమా బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. మహేష్, సమంతతో పాటు కీలక నటీనటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నెల 13 వరకు కాశీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత షూటింగ్‌ని ఢిల్లీకి షిఫ్ట్ చేయనున్నారు. అక్కడ ఓ చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు.
జనవరి 1న విడుదలైన టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. శ్రీకాంత్ అడ్డాల, మహేష్ కాంబినేషన్లో ఇంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ సినిమా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. పీవీపీ సంస్థ ఈ సినిమాను తెలుగు, తమిళంలో విడుదల చేయనుంది. కాజల్, ప్రణీత ఇతర నాయికలు. వీళ్ళతో పాటు ప్రతి షాట్‌లోనూ స్క్రీన్ నిండా జనాలు కనిపించేంత గ్రాండియర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. సంగీతాన్ని మిక్కీ.జె.మేయర్, కెమెరాను రత్నవేలు చూసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments