మహేష్...కాశీ టు ఢిల్లీ!

  • IndiaGlitz, [Wednesday,March 09 2016]

మ‌హేష్ న‌టిస్తున్న తాజా సినిమా బ్ర‌హ్మోత్స‌వం. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా అది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం కాశీలో జ‌రుగుతోంది. మ‌హేష్‌, స‌మంత‌తో పాటు కీల‌క న‌టీన‌టులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నెల 13 వ‌ర‌కు కాశీలో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత షూటింగ్‌ని ఢిల్లీకి షిఫ్ట్ చేయ‌నున్నారు. అక్క‌డ ఓ చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు.
జ‌న‌వ‌రి 1న విడుద‌లైన టీజ‌ర్కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. శ్రీకాంత్ అడ్డాల‌, మ‌హేష్ కాంబినేష‌న్‌లో ఇంత‌కు ముందు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి హిట్ సినిమా ఉండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. పీవీపీ సంస్థ ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేయ‌నుంది. కాజ‌ల్‌, ప్ర‌ణీత ఇత‌ర నాయిక‌లు. వీళ్ళ‌తో పాటు ప్ర‌తి షాట్‌లోనూ స్క్రీన్ నిండా జ‌నాలు క‌నిపించేంత గ్రాండియ‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. సంగీతాన్ని మిక్కీ.జె.మేయ‌ర్‌, కెమెరాను ర‌త్న‌వేలు చూసుకుంటున్నారు.

More News

బాలయ్య వందో సినిమా ఫిక్స్..

బాలకృష్ణ వందో సినిమా ఎవరితో ఉంటుందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

మహేష్ సరసన బాలీవుడ్ భామ....

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం కాశీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.

సాంగ్ షూట్ కోసం సరైనోడు టీమ్ ఇలా...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నచిత్రం సరైనోడు.

మోక్షజ్ఞ గురించి బాలయ్య మనసులో మాట....

నందమూరి నటసింహం బాలకృష్ణ...తన నటవారసుడు మోక్షజ్ఞ రంగప్రవేశం గురించి తన మనసులో మాట బయటపెట్టారు.ఇంతకీ బాలయ్య ఏమన్నారంటే..

దసరా కి బాహుబలి 2 రిలీజ్..

దసరాకి బాహుబలి 2రిలీజ్...అనగానే బాహుబలి 2సినిమా అనుకుంటే పొరపాటే.బాహుబలి 2టీజర్ ని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.