ఐదుసార్లు..అభిమానులకు థాంక్స్ చెప్పిన మహేష్...
- IndiaGlitz, [Monday,June 20 2016]
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన శ్రీమంతుడు' చిత్రం మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిపోయింది. కలెక్షన్స్ పరంగా బాహుబలి' తర్వాత నెక్ట్స్ ప్లేస్ నిలిచింది. ఇప్పుడు అవార్డుల విషయంలో కూడా శ్రీమంతుడు మహేష్ కు పెద్ద సంతృప్తిని మిగులుస్తుంది. శనివారం రాత్రి శ్రీమంతుడు' చిత్రానికిగానూ ఉత్తమనటుడు అవార్డును సొంతం చేసుకున్నాడు.
అయితే మహేష్ బాబు కొన్ని కారణాలతో ఫంక్షన్‌కు రాకపోవడంతో దేవిశ్రీప్రసాద్ అవార్డును అందుకున్నాడు. దీంతో ఇప్పటి తరం నటుల్లో ఐదుసార్లు ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నటుడుగా మహేష్ నిలిచాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పుడు శ్రీమంతుడు చిత్రాలకు మహేష్ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డుకు తాను హాజరు కాలేకపోయానని అయితే ఈ అవార్డుకు కారణమైన అభిమానులకు పెద్ద థాంక్స్ అంటూ ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేశాడు.