పూజలు చేస్తున్న మహేష్ - సమంత.

  • IndiaGlitz, [Monday,February 22 2016]

మ‌హేష్ - స‌మంత పూజ‌లు చేస్తుంది దేని కోసం అనుకుంటున్నారా..? బ్ర‌హ్మోత్స‌వం కోసం. మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం కోసం మ‌హేష్ - స‌మంత - ప్ర‌ణీత తో పాటు కుటుంబ స‌భ్య‌లు అంతా క‌ల‌సి పూజ చేసే స‌న్నివేశాన్ని చాలా నేచుర‌ల్ గా ఉండేలా చిత్రీక‌రిస్తున్నారు. ఈ స‌న్నివేశానికి సంబంధించిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బ్ర‌హ్మోత్స‌వం సినిమాకి సంబంధించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో సినిమా పై రోజురోజుకి క్రేజ్ మ‌రింత పెరుగుతుంది. ఇంత‌కీ బ్ర‌హ్మోత్స‌వం సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మే వ‌ర‌కు ఆగాల్సిందే.