మహేష్ మూవీ షూటింగ్ 15న ప్రారంభం..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ భారీ క్రేజీ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను జులై 15 నుంచి ప్రారంభించనున్నారు. ఈ చిత్రం కోసం ముందుగా మహేష్ పై అన్నపూర్ణ స్టూడియోలో ఓ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా హీరోయిన్ గా నటిస్తుంటే...డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు. మహేష్ ఈ చిత్రంలో సిన్సియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ ఇంటలిజెన్స్ ఆఫీస్ సెట్ డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com