మురుగుదాస్ తర్వాత మహేష్ చేసే మూవీ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ త్వరలో మురుగుదాస్ తో ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ స్వదేశం రాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే...బ్రహ్మోత్సవం అంచనాలను తారుమారు చేయడంతో పి.వి.పి సంస్థకు మరో సినిమా చేస్తానని మహేష్ మాట ఇచ్చారట. నాగార్జున - కార్తీతో పి.వి.పి నిర్మించిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మహేష్ తో పి.వి.పి నిర్మించనున్న చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. మురుగుదాస్ మూవీ తర్వాత మహేష్ చేసే సినిమా వంశీ పైడిపల్లితోనే అని ప్రచారం జరుగుతుంది. అయితే...మహేష్ పూరి జగన్నాథ్ కి కూడా ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. మరి...మురుగుదాస్ మూవీ తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి నిర్మించే చిత్రంలో నటిస్తారా..? లేక పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com