Rajamouli:మహేష్ చాలా అందగాడు.. త్వరలోనే మీకు పరిచయం చేస్తా: రాజమౌళి
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తన సతీమణి రమాతో కలిసి జపాన్‌లో జరిగిన RRR ప్రత్యేక స్క్రీనింగ్‌కి హారయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌బాబుతో తాను తీయబోయే చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నా తదుపరి చిత్రం మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకా క్యాస్టింగ్ పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం. అతడి పేరు మహేష్ బాబు.. తెలుగు యాక్టర్. మీలో చాలా మందికి ఆయన తెలుసు అనుకుంటా. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను" అంటూ రాజమౌళి చెప్పారు.
దీంతో ప్రస్తుతం జక్కన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. రాజమౌళి మాటలతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీంతో SSMB29 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే జపాన్ టూర్లో రాజమౌళికి అక్కడి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఓ 83 ఏళ్ల మహిళ రాజమౌళికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జక్కన్న ఎమోషనల్ అయ్యారు.
"తమ ప్రియమైన వారు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జపాన్‌లో ఓరిగామి క్రేన్లను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. ఈ 83 ఏళ్ల మహిళ అలాంటివి 1000 తయారు చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఆమెకి చాలా నచ్చిందట. ఈ గిఫ్ట్ లోపలికి పంపించి ఆవిడ మాత్రం చలిలో బయట ఎదురుచూస్తున్నారు. ఇలాంటి అభిమానానికి ఏమిచ్చినా రుణం తీరదు. థ్యాంక్యూ" అంటూ ఆమెతో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు.
కాగా ఈ సినిమా కోసం మహేష్.. ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ బాడీ పెంచడంతో పాటు జట్టు, గడ్డాన్ని బాగా పెంచేశారు. ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్లో అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీని 2026లో విడుదల చేయనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com