అమీర్ పేటలో మహేష్..
Saturday, July 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం నిన్న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలసిందే. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే ఫస్ట్ షెడ్యూల్ ఆగష్టు 13 వరకు జరుగుతుంది.
ఇదిలా ఉంటే...మహేష్ ఆగష్టు 1 నుంచి షూటింగ్ లో పాల్గొంటాడు అని ప్రచారం జరిగింది కానీ...తాజా సమాచారం ప్రకారం ఈరోజు నుంచి మహేష్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈరోజు అమీర్ పేట లోని జెన్టిక్స్ లో మహేష్ పై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ రెడీ చేసారు. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments