స్పీడు పెంచమంటున్న సూపర్ స్టార్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ లో బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ చేయాలనుకోవడం..అదే నెలలో మురుగుదాస్ తో మూవీ ప్రారంభించాలనుకోవడంతో...బ్రహ్మోత్సవం ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయమంటున్నాడట సూపర్ స్టార్ మహేష్. ఇటీవల మహేష్, కాజల్ పై చిలుకూరులో కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రావు రమేష్, సత్యరాజ్, సంపత్, జయసుథ, రేవతి..తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com