తన ట్రిప్ తో మహేష్ హ్యపీ...

  • IndiaGlitz, [Friday,January 08 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు బ్ర‌హ్మోత్సవం షెడ్యూల్‌లో బిజీగా ఉన్నాడు. చెన్నైలో జ‌రుగుతున్న ఈ షెడ్యూల్‌కు ముందు మ‌హేష్ దుబాయ్‌కు చిన్న ట్రిప్ కూడా వేశాడు. ఈ సంగ‌తి అందిరికీ తెలిసిందే. ఇప్పుడు త‌న ట్రిప్ గురించి మ‌హేష్ సోష‌ల్ మీడియా త‌న అబిప్రాయాల‌ను పంచుకున్నాడు. త‌న పిల్ల‌లు ట్రిప్‌ను బాగా ఎంజాయ్ చేశార‌ని, దుబాయ్‌లో తమకు దొరికిన అతిథ్యం వ‌రల్డ్ క్లాస్‌గా ఉంద‌ని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా క్రిస్‌మ‌స్ సంద‌ర్భంగా క్రిస్మ‌స్ తాత సంత త‌మ రూమ్‌కు విచ్చేయ‌డం మ‌ర‌చిపోలేన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను పొందిన బెస్ట్ హోట‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌లో ఇదొక‌ట‌ని చెప్పుకొచ్చాడు.