మహేష్ ది పక్కా అయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్‌కు బ్రహ్మోత్సవం ఇచ్చిన పరాజయం ఓ రకంగా చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో పాటు నిర్మాత కూడా భారీగా నష్టపోయాడు. దాంతో పివిపి బ్యానర్‌లో మహేష్ మరో సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే మహేష్, మురుగదాస్ సినిమాను స్టార్ట్ చేయడంతో అవన్నీ పుకార్లుగా మిగిలిపోయాయి.
అయితే మహేష్ బ్రహ్మోత్సవం ఎఫెక్టో మరేదో తెలియదు కానీ పివిపి బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. అయితే ఈ సినిమా 2017లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మురుగదాస్ చిత్రంతో పాటు మహేష్ కొరటాల సినిమా చేస్తాడు, తర్వాతే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలోనే చిత్రీకరణ ఉంటుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com