చీప్ అల్లు పాలిటిక్స్ అంటున్న మహేష్ ఫ్యాన్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ గురించి చెప్పను అంటూ చెప్పిన చెప్పను బ్రదర్...వివాదం రోజురోజుకు మరింత ముదురుతుంది. నిన్న పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ - అల్లు అరవింద్ లకు వ్యతిరేకంగా చూసుకుంటాం బ్రదర్ అంటూ ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. నేడు ఊహించని విధంగా మహేష్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ - అల్లు అరవింద్ లకు వ్యతిరేకంగా చీప్ అల్లు పాలిటిక్స్, ఇవ్వను బ్రదర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ వివాదంలోకి మహేష్ ఫ్యాన్స్ రావడానికి కారణం ఏమిటంటే...అల్లు అరవింద్ తెలుగు రాష్ట్రాల్లో సరైనోడు సినిమా కోసం ఇంకా ధియేటర్స్ ని బ్లాక్ చేసారట. బ్రహ్మోత్సవం సినిమాని ప్రదర్శించేందుకు థియేటర్స్ ఇవ్వడానికి అల్లు అరవింద్ నిరాకరించారట. అందుకనే మహేష్ ఫ్యాన్స్ చీప్ అల్లు పాలిటిక్స్ & ఇవ్వను బ్రదర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ వివాదం గురించి మెగా ఫ్యామిలీ కానీ అల్లు అరవింద్ కానీ మాట్లాడితే బాగుంటుంది. బహుశా ఈ వివాదానికి తెర తీసిన అల్లు అర్జునే మీడియాతో మాట్లాడి వివాదానికి తెర దించుతారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com