మహేష్ డ్యూయెల్ రోల్...?
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రహ్మోత్సవం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి చిత్రం వాస్కోడిగామా(వినపడుతున్న పేరు) కోసం రెడీ అయిపోతున్నాడు. ఎన్.వి.ప్రసాద్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించబోతున్నాడు. హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు. ఈ చిత్రంలో మహేష్ సిబిఐ ఆఫీసర్ గా కనిపిస్తాడని వార్తలు కూడా వినిపిస్తుంటే మరి కొందరేమో మహేష్ రా ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడని అంటున్నారు.
ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్‌లో దర్శనమిస్తాడని అంటున్నారు. ముందు సాంగ్ చిత్రీకరణతో సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని ఒకటి ఆఫీసర్ పాత్ర అని, మరోటి కాలేజ్ లెక్చరర్ పాత్ర అని వార్తలు వినపడుతున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com