Mahesh:మహేష్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 5 సెకన్ల వాయిస్‌కు రూ.5 కోట్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'గుంటూరు కారం' సినిమాతో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఓ ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్ పే సంస్థకు తన గొంతును అరువుగా ఇచ్చారు. సాధారణంగా ఫోన్ పే నుంచి నగదు లావాదేవీలు చేసేటప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. ఇప్పటివరకు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ వస్తుంది. అయితే అది హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే వినిపిస్తుంది.
తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉన్న ఫోన్ పే.. స్థానిక భాషల్లోకి కూడా క్యూఆర్ కోడ్ వాయిస్‌లను వినిపించేలా ఏఐ టెక్నాలజీ వినియోగిస్తుంది. ఇందుకోసం తెలుగులో మహేష్ వాయిస్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే స్కానింగ్ చేసినప్పుడు ఉదాహరణగా.. ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి.. హ్యాట్సాఫ్ గురువు గారు అంటూ మహేష్ వాయిస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక కన్నడ భాషలో కిచ్చా సుదీప్, మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో ఫోన్ పే ఒప్పందం చేసుకుంది.
అయితే ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం ఫోన్ పే సంస్థ మహేష్‌కు ఎంత చెల్లించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం చెల్లించారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమ హీరో క్రేజ్ అలా ఉంటది మరి అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి పండుగ కానుకగా 'గుంటూరు కారం'తో అభిమానులను అలరించారు. డివైట్ టాక్ వచ్చినా తన మాస్ ఫాలోయింగ్‌తో దాదాపు రూ.300కోట్లు వసూళ్లు రాబట్టాడు.
మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ బాడీ పెంచడంతో పాటు జట్టు, గడ్డాన్ని బాగా పెంచేశారు. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ 2025 సమ్మర్‌లో విడుదల కానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout