ఎన్టీఆర్ గురించి మహేష్ కామెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే...ఏమాత్రం టెన్షన్ లేకుండా చెప్పేస్తాడు. ఇక డ్యాన్స్ అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదరగొట్టేస్తాడు.అందుకనే.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయాలంటే కొంతమంది హీరోయిన్స్ కి టెన్షన్. ఇదిలా ఉంటే...బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో సూపర్ స్టార్ మహేష్ ని...ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్స్ ఎవరు అని అడిగితే...ఏమాత్రం ఆలోచించకుండా బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్ అని చెప్పారు.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...ఓ ఇంటర్ వ్యూలో ఎన్టీఆర్ లా నన్ను డ్యాన్స్ చేయమంటే నా వల్ల కాదు అంటూ ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా చేస్తాడనే విషయాన్ని చెప్పకనే చెప్పేసారు. నిన్న పవన్ కళ్యాణ్, నేడు మహేష్ బాబు...ఇలా ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి అభినందించడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments