కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ హీరోయిన్ కన్నీళ్లు పెట్టేసుకుంది. అది కూడా సెట్‌లోనే. ఇంతకు ఎవరా హీరోయిన్? అంటే మీనాక్షి దీక్షిత్ . మహేష్ 25వ చిత్రం 'మహర్షి'లో మీనాక్షి ఓ మంచి పాత్రను పోషించింది. దూకుడు తర్వాత మహేష్‌తో మీనాక్షిదీక్షిత్ నటించిన చిత్రమిది.
మీనాక్షి డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు వంశీ పైడిపల్లి ఫోన్ చేశాడట. ఆమె తనకు డెంగ్యూ అని చెప్పిందట. పరిస్థితి తెలుసుకున్న వంశీ ఆమెను తగ్గిన తర్వాతే కలవమని చెప్పాడట. మూడు వారాల తర్వాత వంశీపైడిపల్లిని మీనాక్షి దీక్షిత్ కలిసింది. అంతా ఓకే అనుకున్నారు.
మీనాక్షితో మహేష్ షూటింగ్ ఉన్నరోజు సెట్‌లో మీనాక్షి బ్యాగ్ కనపడటలేదట. దాంతో ఆమె కన్నీళ్లు పెట్టేసుకుంది. దాంతో యూనిట్ బ్యాగ్ వెతికి తెచ్చిపెట్టారట. అప్పటికే షాట్‌కి వచ్చిన మహేష్ మీనాక్షి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడట.బ్యాగ్ దొరకడంతో మీనాక్షి.. మహేష్ దగ్గరకు వెళ్లి షూటింగ్‌కు తన వల్ల బ్రేక్ రావడం వల్ల సారీ చెప్పిందట. మహేష్ చాలా కూల్‌గా తీసుకుని నవ్వేశాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com